TG-3533
Telugu

కళ్లుండి చూడలేని

Kallundi Choodaleni

17
views
పల్లవి

కళ్లుండి చూడలేని ఎందరో ఉన్నారు చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు (2) వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనే జీవింప చేయాలి నీ మహిమలోనే ||కళ్లుండి||

1వ చరణం

కంటి చూపుతో నన్ను కాచియున్నావు గుండె పైన వాత పెట్టి నను మార్చినావు (2) మరణాన్ని తప్పించావు జీవాన్ని నాకిచ్చావు (2) ఇంకేల నా యేసయ్యా ||కళ్లుండి||

2వ చరణం

నీదు ఆత్మతో నన్ను నింపియున్నావు నీదు సాక్షిగా నన్ను ఇల నిలిపియుంచావు (2) నీవే నా గమ్యమని నీలోనే నడిచెదను (2) నాకేగా పరలోకము ||కళ్లుండి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.