TG-3535
Telugu

కలువరి గిరి నుండి

Kaluvari Giri Nundi

19
views
పల్లవి

కలువరి గిరి నుండి ప్రవహించే ధార ప్రభు యేసు రక్త ధార (2) నిర్దోషమైన ధార ప్రభు యేసు రక్త ధార (2) ప్రభు యేసు రక్త ధార (2) ||కలువరి||

1వ చరణం

నా పాపముకై నీ చేతులలో మేకులను దిగగొట్టిరా (2) భరియించినావా నా కొరకే దేవా నన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి||

2వ చరణం

నా తలంపులే నీ శిరస్సుకు ముండ్ల కిరీటముగా మారినా (2) మౌనము వహియించి సహియించినావా నన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.