♪♫
TG-3536
Telugu
కలువరి గిరి సిలువలో
Kaluvari Giri Siluvalo
16
views
పల్లవి
కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా (2) విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా (2) యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా (2) ||కలువరి||
1వ చరణం
కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా (2) కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా (2) ముళ్ళతోన మకుటమల్లి నీదు శిరమున నుంచినా – (2) ||కలువరి||
2వ చరణం
జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా (2) మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా (2) కలుష రహిత వ్యధను చెంది అలసి సొలసి పోతివా – (2) ||కలువరి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.