TG-3537
Telugu

కలువరి సిలువ

Kaluvari Siluva

0
views
పల్లవి

కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా (2) అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా (2) ||కలువరి||

1వ చరణం

కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకొన్నావయ్యా వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా (2) మధురమైన నీ ప్రేమ మరువగలనా ఆ ప్రేమ (2) అనుక్షణం నీ ఆలోచన నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||

2వ చరణం

పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కార్చావయ్యా దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా (2) మధురమైన నీ ప్రేమ మరువగలనా ఆ ప్రేమ (2) అనుక్షణం నీ ఆలోచన నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||