కల్వరియున్నంత దూరం వెళ్లెను నా

kalvariyunnantha duuram velllenu naa

🎵 TG-550💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

కల్వరియున్నంత దూరం వెళ్లెను నా కొరకు నా కొరకు కల్వరి యున్నంత దూరం వెళ్లెను నా ప్రియ రక్షకుడు ||కల్వరియున్నంత దూరం||

1వ చరణం

తన రక్తమెంతో ధారపోసెను పోసెను పోసెను తన రక్తమెంతో ధారపోసెను నా ప్రియ రక్షకుడు ||కల్వరియున్నంత దూరం||

2వ చరణం

నా పాప శాపమంత క్రీస్తు బాపెను బాపెను బాపెను నా పాప శాపమంత క్రీస్తు బాపెను నా ప్రియ రక్షకుడు ||కల్వరియున్నంత దూరం||

3వ చరణం

చావును జయించి మరల లేచెను లేచెను లేచెను చావును జయించి మరల లేచెను నా ప్రియ రక్షకుడు ||కల్వరియున్నంత దూరం||

4వ చరణం

తన యాత్మతోడు సమకూర్చెను కూర్చెను కూర్చెను తన యాత్మతోడు సమకూర్చెను నా ప్రియ రక్షకుడు ||కల్వరియున్నంత దూరం||

5వ చరణం

నీతి త్రోవయందు నన్ను నడ్పును నడ్పును నడ్పును నీత్రి త్రోవ యందు నన్ను నడ్పును నా ప్రియ రక్షకుడు ||కల్వరియున్నంత దూరం||

6వ చరణం

మరల వచ్చి తన యొద్ద చేర్చును చేర్చును చేర్చును మరల వచ్చి తన యొద్ద చేర్చును నా ప్రియ రక్షకుడు ||కల్వరియున్నంత దూరం||

7వ చరణం

శృంగారమైన మోక్షం నాకు చూపెను చూపెను చూపెను శృంగార మైన మోక్షం నాకు చూపెను నా ప్రియ రక్షకుడు ||కల్వరియున్నంత దూరం||

Report Error