TG-2503
Telugu

కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా

kanaleeni kanuleelanayyaa vinaleeni chevuleelanayyaa

75
views
పల్లవి

కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2) అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని||

1వ చరణం

దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.