♪♫
TG-3546
Telugu
కనలేని కనులేలనయ్యా
Kanaleni Kanulelanayyaa
0
views
పల్లవి
కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2) అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని||
1వ చరణం
దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2) అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||
2వ చరణం
మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా (2) అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||
3వ చరణం
రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2) అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||
4వ చరణం
అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2) ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా ||కనలేని||