TG-3547
Telugu

కనలేను ప్రభుకేల

Kanalenu Prabhukela

0
views
పల్లవి

కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై మనలేను ప్రభు జూచి కఠినాత్మునై కఠినాత్మునై… ||కనలేను||

1వ చరణం

పాపులనేలేటి ప్రభునేలనో బల్లెంపు పోటుల బంధించిరి (2) కనుపించు పాపాలు రక్తాలలో ప్రభు బాధలో ||కనలేను||

2వ చరణం

ముండ్ల కిరీటము ప్రభుకేలనో మూఢులు మోపిరి ప్రభు నెత్తిని (2) ప్రభు రక్త గాయాలు నా పాపమా ప్రభు శాపమా ||కనలేను||

3వ చరణం

తన జంపు శత్రువుల క్షమియించెను క్షమియింపుమని తండ్రిని వేడెను (2) క్షమా బుద్ధి నేర్పించి చితి నోర్చెను భరియించెను ||కనలేను||

4వ చరణం

మోయజాలని సిలువ మోయించిరి దివినేలు బాహువులు బంధించిరి (2) నా పాపమంతయు ప్రభు మోసెను భరియించెను ||కనలేను||

5వ చరణం

జీవజలముల నిచ్చుఁ ప్రభుకేలనో చేదు చిరక త్రాగను అందించిరి (2) ఆత్మ దాహము తీర్చ బలి అయ్యెను సిలువొందెను ||కనలేను||

6వ చరణం

తన ఆత్మ తండ్రికి సమర్పించెను తనదంతా తండ్రితో చాచుంచెను (2) తలవంచి తండ్రిలో తుది చేరెను కను మూసెను ||కనలేను||

7వ చరణం

లోకాలనేలేటి ప్రభువేలనో ఈ ఘోర మరణంబు గురి అయ్యెనో (2) నా పాప బ్రతుకేల ప్రభువేడ్చెనో సిలువేసెనో ||కనలేను||