♪♫
TG-3551
Telugu
కన్నీరే మనిషిని బాధిస్తుంది
Kanneere Manishini Baadhisthundi
14
views
పల్లవి
కన్నీరే మనిషిని బాధిస్తుంది ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది (2) కన్నీరే కాదనుకుంటే ఓదార్పే కరువైపోతుంది (2) ||కన్నీరే||
1వ చరణం
కన్నీరే మరియను బాధించింది ఆ కన్నీరే మరణము గెలిపించింది (2) కన్నీరే కాదనుకుంటే లాజరు తిరిగి బ్రతికేనా (2) కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించేనా (2) ||కన్నీరే||
2వ చరణం
కన్నీరే హన్నాను బాధించింది ఆ కన్నీరే కుమారుని దయచేసింది (2) కన్నీరే కాదనుకుంటే సమూయేలు జన్మించేనా (2) కన్నీరే వలదనుకుంటే దేవుని కృపను గాంచేనా (2) ||కన్నీరే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.