♪♫
TG-3553
Telugu
కన్నీటి లోయలలో
Kanneeti Loyalalo
0
views
పల్లవి
కన్నీటి లోయలలో – నేనెంతో కృంగిననూ కన్నీరు చూచువాడు – కార్యము జరిగించును (2) నీ మనసు కదలకుండా – నీ మనసు కృంగకుండా నీతోనే ఎల్లప్పుడూ – నేనుందున్ అంతం వరకు (2) ||కన్నీటి||
1వ చరణం
చీకటి బాటయైనా – భయంకర శోధన కలువున్ ఆ వేళలో – సిలువ నీడ నీకై (2) ||నీ మనసు||
2వ చరణం
ఎర్ర సముద్ర తీరం – మొర్రలిడిన్ తన దాసులు గుండెల్లో దాగి ఉన్న – గొప్ప బాధ తొలగెన్ (2) ||నీ మనసు||
3వ చరణం
ఎంత కాలం వేచి ఉండాలి – నాథా నీ రాకడకై శ్రమలు తీరుటకు – ఎంతో కాలం లేదు (2) ||నీ మనసు||