కన్నీటితో నిండిన గుండెతో అలసిన సోలిన కూలిన నేస్తమా
Kanneetithoo Nindina Gundethoo Alasina Soolina Koolina Neesthamaa
కన్నీటితో నిండిన గుండెతో అలసిన సోలిన కూలిన నేస్తమా (2) యేసే నిజ రక్షకుడై నిన్ను పిలువగా యేసే విమోచకుడై నిన్ను పిలువగా (2) నీవు రక్షణ పొందేదవు నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము (2) వేదనతో ప్రార్థించిన హృదయమును కుమ్మరించిన ఆవేదన అనుభవించిన హన్నా జీవితములో (2) ఆశీర్వాదింపబడెను ఫలభరితముగా మారెను ఆవేదనలన్నీ అదృశ్యమాయెను (2) యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా యేసయ్య సన్నిధిలో కన్నీరు విడువగా (2) నీవు రక్షణ పొందేదవు నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము (2) శాపగ్రస్త దేశము నుండి వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసిన రూతమ్మ జీవితములో (2) హెచ్చింపునొందెను దీవెనగా తీర్చబడెను యూదా గోత్రములో ఘనురాలు ఆయెను (2) యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా (2) నీవు రక్షణ పొందేదవు నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.