కన్నులనెత్తి పైరుల చూడ
Kannulaneththi Pairula Choodu
కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2) ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2) కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2) ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా||
మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2) వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా||
విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2) జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా||
మందిరము పడియుండ మందుడవై నీవుండి (2) సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) ||ఓ యువకుడా||
మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ (2) నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) ||ఓ యువకుడా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.