TG-1632
Telugu

కన్నులుండి చూడలేవ యేసు మహిమను

kannulundi chuudaleeva yeesu mahimanu

54
views
పల్లవి

కన్నులుండి చూడలేవ యేసు మహిమను చెవులుండి వినలేవ యేసు మాటను (2) నాలుకుండి పాడలేవ యేసు పాటను కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి||

1వ చరణం

చెడును చూడకుండ నీ కనులను చెడును వినకుండ నీ చెవులను చెడును పలుకకుండ నీ నాలుకన్ చెడులో నడువకుండ నీ కాళ్ళను దూరముగా నుంచు ఓ సోదరా దూరముగా నుంచు ఓ సోదరీ (2) ||కన్నులుండి||

2వ చరణం

దుష్టుల ఆలోచన చొప్పునా నడువక సాగుమా నీ యాత్రలో పాపుల మార్గమందు నీవు నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకుమా ఓ సోదరా కూర్చుండకుమా ఓ సోదరీ (2) ||కన్నులుండి||

3వ చరణం

యెహోవా దొరుకు కాలమందునా ఆయనను మీరు వెదక రండి ఆయన మీ సమీపమందు నుండగా ఆయననూ మీరు వేడుకొనండి ఆయన తట్టు తిరుగు ఓ సోదరా ఆయన తట్టు తిరుగు ఓ సోదరీ (2) ||కన్నులుండి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.