TG-3556
Telugu

కంట నీరేల

Kanta Neerela

0
views
పల్లవి

కంట నీరేల? కలతలు ఏల? యేసుతో నీవు సాగు వేళ శోధన వేళ రోదన ఏల? నీ విశ్వసము గెలిచే వేళ (2) నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు ||కంట||

1వ చరణం

వలదు చింతన దేనికైనా విన్నవించుము నీ నివేదన (2) పొందితినను నీదు నమ్మకము దరికి చేర్చును తగిన విజయము (2) తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2) ||కంట||

2వ చరణం

రేపు గూర్చిన భయము వలదు ప్రతి దినము తగు బాధ కలదు (2) నీదు భారము మోయు ఆ దేవుడు నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2) నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2) ||కంట||