కన్య మరియా గర్భమందు బేత్లెహేము అను ఊరిలో
Kanya Mariyaa Garbhamandu Beethleheemu Anu Ooriloo
కన్య మరియా గర్భమందు బేత్లెహేము అను ఊరిలో రక్షకుండు ఉదయించాడులే ఓ భుజనమా సన్నుతింప పయనమవ్వరే ఇది సంతోష సమయమే సంబరమే అంబరమున ||కన్య మరియా||
చెరలో ఉన్నవారందరిని విడిపించే విమోచకుడు చీకటి ముసుగును తొలగించి వెలుగుతో నింపే తేజోమయుడు దీనునిగా దిగివచ్చారు సర్వమానవ రక్షకుడు అందరికి ఆయనే ప్రభువైనాడు (2) ఇది సంతోష సమయములే సంబరమే అంబరమున (2) ||కన్య||
మార్గము తెలియనివారందికీ మార్గము తానై వచ్చాడు చెదరినవారిని దరిచేర్చుటకు దీనుడై దిగివచ్చాడు ఆకలిదప్పులు లేనిరోజు ఆయనతోనే సాధ్యమని అందరికి ఆయనే ప్రభువైనాడు (2) ఇది సంతోష సమయములే సంబరమే అంబరమున (2) ||కన్య||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.