TG-3562
Telugu

కరుణ చూపించుమా

Karuna Choopinchumaa

0
views
పల్లవి

కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగా మహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా (2) నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాము ఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము (2) కరుణగల దేవుడు నీవు కరుణించి కాపాడుమా (2) ||కరుణ||

1వ చరణం

ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివి గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి (2) నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడాము నీ మహిమను తిరిగి చూడగా – నీ సన్నిధిలో చేరాము (2) ||కరుణగల||

2వ చరణం

ఇశ్రాయేలు వారిగ మేము – నీ ఉనికిని ప్రశ్నించాము నీ ప్రేమను రుచి చూసిననూ – మారాను కురిపించాము (2) చెలరేగే సర్పము కాటు – మములను కబళించే వేళ మాకు దిక్కు నీవేనంటూ – మోకరించి నిను వేడితిమి (2) ||కరుణగల||

3వ చరణం

మరణమునే జయించి నీవు – సజీవుడిగా నిలిచావు నిన్ను నమ్మి వేడిన చాలు – మా తప్పులు మరిచావు (2) నేను జీవించితి గనుక – మీరును జీవించెదరన్న వాగ్దానము నమ్మితిమయ్యా – నెరవేర్చుము మా యేసయ్య (2) ||కరుణగల||