కరుణ కటాక్షము గల యేసయ్యా నను విస్తరింపజేయు మహనీయ
Karuna Kataakshamu Gala Yeesayyaa Nanu Vistharinpajeeyu Mahaneeya
కరుణ కటాక్షము గల యేసయ్యా నను విస్తరింపజేయు మహనీయ (2) దివ్య సుందరమ - దయకు నిలయమ - దివిలో కాంతితేజమా పరిమళ నామమ - ప్రేమకు నిలయమ పరిశుద్ధ స్తుతి గానమా 1. ఏమున్నదనీ నాపై లక్ష్యముంచినావు ఆదరించి ప్రేమించి కటాక్షించినావు (2) నీ రెక్కల నీడే సురక్షితం - నీ పాద సన్నిధౌ క్షేమము (2) కృపవెంబడి కృపను - నిత్యమైన ప్రేమను అధికమైన మహిమను విస్తరింపజేసావు (2) ||కరుణ||
2. నేనెంతటి వాడనని ఇంతగ హెచ్చించావు ఏలుటకు ఎన్నుకొని అభిషేకించావు (2) నీ ఇష్టునిగా నివసించెదను - నీ ఉద్దేశము నే మరువను (2) కృపవెంబడి కృపను - నిత్యమైన ప్రేమను అధికమైన మహిమను విస్తరింపజేసావు (2) ||కరుణ||
3. ఏ యోగ్యత లేని నాకు తోడుగ నిలిచావు నింద అవమానములో ఘనతనిచ్చినావు (2) నీ నడిపింపుకు లోబడితిని - నీ స్వాస్థ్యముకై వేచియుంటిని (2) కృపవెంబడి కృపను - నిత్యమైన ప్రేమను అధికమైన మహిమను విస్తరింపజేసావు (2) ||కరుణ||