కరుణామయుడా పరలోక
Karunaamayudaa Paraloka
కరుణామయుడా పరలోక రాజా నిత్యనివాసి నిర్మల హృదయుడా (2) నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు ||కరుణామయుడా||
గడిచిన దినములన్ని కాపాడినావు కృపాక్షేమములే నా వెంట ఉంచావు (2) విడువక నా యెడల కృప చూపినావు (2) విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ (2) ||నీకే స్తోత్రములు||
శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినా వేదనలెన్నో కలిగిన వేళలో (2) సహించే శక్తి నాకిచ్చినావు (2) నీ సేవలో నన్ను నడిపించినావు (2) ||నీకే స్తోత్రములు||
నూతన యుగములోన నను నిలిపినావు నూతనాత్మతో నను నింపు దేవా (2) నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి (2) ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ వార్త (2) ||నీకే స్తోత్రములు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.