TG-3564
Telugu

కరుణించవా నా యేసువా

Karuninchavaa Naa Yesuvaa

0
views
పల్లవి

కరుణించవా నా యేసువా ఓదార్చవా నజరేతువా (2) నీ కృపలో అనుదినము రక్షించవా నీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా (2) ||కరుణించవా||

1వ చరణం

నిరాశ నిస్పృహలతో కృంగిన వేళ బలమైన శోధన నను తరిమిన వేళ (2) మిత్రులే శత్రువులై దూషించిన వేళ (2) లోకమే విరోధమై బాధించిన వేళ (2) ||కరుణించవా||

2వ చరణం

ఆత్మీయ యాత్రలో నీరసించు వేళ నీ సిలువ పయనంలో అలసిపోవు వేళ (2) సాతాను పోరాటమే అధికమైన వేళ (2) విశ్వాస జీవితమే సన్నగిల్లు వేళ (2) ||కరుణించవా||