TG-3565
Telugu

కరుణించి తిరిగి సమకూర్

Karuninchi Thirigi Samakoorchu

15
views
పల్లవి

కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా (2) క్షమాపణ నిన్ను వేడుచున్నాను (2) దావీదు రాజు దీనుడై వేడ (2) అవనిలో బొందిన నష్టములన్నియు (2) దేవా నీవు సమకూర్చితివే (2) ||కరుణించి||

1వ చరణం

శత్రు సమూహపు కుతంత్రములతో (2) బొత్తిగా నేను నష్టపడితిని (2) మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి (2) ||కరుణించి||

2వ చరణం

పసరు గొంగళి – చీడ పురుగులు (2) నాశనము చేసిన పంటను కూర్చుమా (2) యేసు ప్రభూ నిన్ను వేడుచున్నాను (2) ||కరుణించి||

3వ చరణం

ప్రేమ సంతోషానందములను (2) ప్రధాన యాజకా పోగొట్టుకొంటిని (2) ప్రేమతో నీవు సమకూర్చుమా (2) ||కరుణించి||

4వ చరణం

పాపపు విషముతో నా పాత్ర నిండెను (2) ప్రభు యేసుండను పిండిని కలుపుము (2) పాప మరణమును తొలగించుమా (2) ||కరుణించి||

5వ చరణం

ఆత్మీయ సోమరితనములో నుండి (2) ఆత్మ నష్టముల నెన్నియో బొందితి (2) ఆత్మ దేవా నీవు సమకూర్చుమా (2) ||కరుణించి||

6వ చరణం

పాపము చేసి పడియున్న చోటున్ (2) ప్రాపుగా నీవు జూపుమో ప్రభువా (2) కోపగించక నాపై కృప జూపుమా (2) ||కరుణించి||

7వ చరణం

చేసిన పాపము కప్పుకొనక (2) విశ్వాసముతో ఒప్పుకొందున్ (2) సిలువ రక్తముతో శుద్ధి చేయుమా (2) ||కరుణించి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.