TG-4787
Telugu

కరుణించుమా కృపచూపుమా నీ రెక్కల క్రింద

Karuninchumaa Krupachoopumaa Nee Rekkala Krinda

16
views
పల్లవి

కరుణించుమా కృపచూపుమా నీ రెక్కల క్రింద నను దాయుమా శత్రువువలనుండి కాపాడుమా (2) నన్ను మ్రింగువారు దూషణలు పలుకగ కృపాసత్యములను వర్షమువోలె ఆకాశమునుండి కురిపించితివా దుష్టుల నోళ్లను కడతేర్చితివా (2) ||కరుణించుమా||

1వ చరణం

సింహముల మధ్యను నా ప్రాణముండగ ఏ అపాయమును దరిచేరకుండగ నీ ప్రభావమును కనుపరచితివా ఆకాశముకంటె అత్యున్నతుడా (2) ||కరుణించుమా||

2వ చరణం

చిక్కించుటకై వలయొడ్డియుండగ నా అడుగులను చిక్కుకొనకుండా వేటగాని వలనుండి  తప్పించితివా రక్షకుడవై నన్ను కాపాడితివా (2) ||కరుణించుమా||

3వ చరణం

నా ప్రాణమెంతో నిబ్బరముగనున్నది మహోన్నతమైన నా దేవునికి స్వరమండలముతో స్తుతిచేసేదా సీతారానే వాయించేదా (2) ||కరుణించుమా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.