♪♫
TG-3566
Telugu
కరుణించుము మము పరమ
Karuninchumu Mamu Parama
0
views
పల్లవి
కరుణించుము మము పరమ పితా శరణం నీవే ప్రభు యేసా (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యెరూషలేము చుట్టూను – పర్వతములు ఉంచిన దేవా పరిశుద్ధుల చుట్టును నీవే – నిరతము నుందు నంటివిగా ||హల్లెలూయా||
1వ చరణం
రాత్రిలో కలుగు భయమేమి – రాకుండ జేయుచుండెదవు రాత్రిలో నీ హస్తముతో – రయముగ కప్పుము ప్రియ తండ్రి ||హల్లెలూయా||
2వ చరణం
రథమును గుఱ్ఱము రౌతులను – రాత్రిలో చుట్టిరి సిరియనులు రథమును అగ్ని గుఱ్ఱములన్ – రక్షణగా ఉంచిన దేవా ||హల్లెలూయా||
3వ చరణం
అర్ధ రాత్రిలో యాకోబు – అడవిలో నిద్రించిన గాని ప్రార్ధన చేయుట నేర్పితివి – పరలోక ద్వారము చూపితివి ||హల్లెలూయా||