TG-1606
Telugu

కరుణామయుడా పరలోక రాజా నిత్యనివాసి

karunnaamayudaa paralooka raajaa nithyanivaasi

50
views
పల్లవి

కరుణామయుడా పరలోక రాజా నిత్యనివాసి నిర్మల హృదయుడా (2) నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు ||కరుణామయుడా||

1వ చరణం

గడిచిన దినములన్ని కాపాడినావు కృపాక్షేమములే నా వెంట ఉంచావు విడువక నా యెడల కృప చూపినావు విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ (2) ||నీకే||

2వ చరణం

శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినా వేదనలెన్నో కలిగిన వేళలో సహించే శక్తి నాకిచ్చినావు నీ సేవలో నన్ను నడిపించినావు నూతన యుగములోన నను నిలిపినావు నూతనాత్మతో నను నింపు దేవా నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ వార్త

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.