కష్టాలెన్నున్నా - కన్నీళ్ళెన్నైనా
kashtaalennunnaa - kanneellennainaa
కష్టాలెన్నున్నా - కన్నీళ్ళెన్నైనా కాలమెంతైనా - కారణమేదైనా విడువను నిన్ను- కదలను నేను (2) నీకోసమేగా నన్ను ఎన్నుకొన్నావు నీకోసమేగా నన్ను చేసుకొన్నావు (2)
పరిశుద్ధుతండ్రివైన నిన్ను పోలి నేను పరిశుద్ధునిగా నీతో నడవాలని జగత్పునాది వేయకముందే నీ ఉన్నత ప్రేమలో నన్నుచూసావు ఆదిలో నువ్వే అంతము చెప్పి నీ మహిమను నాకు చూపించావు నీసంకల్పం నాకు జీవమై నీకోసమే నన్ను బ్రతకమన్నావు (2) ||కష్టాలెన్నున్నా||
క్రీస్తుకూడ నాకొరకు శ్రమలననుభవించి మౌనియై నాకు మాదిరయ్యాడు శ్రమలే మహిమకు మార్గమంటూ ధైర్యమిచ్చి నన్ను ఆదరించాడు మార్గమే చూపి నీనీతి నాకిచ్చి నిత్యమూ నీతోవుండే కృపను చూపావు నీ దర్శనమే నాకు గమ్యమై నీసన్నిధికే నన్ను నడవమన్నావు (2) ||కష్టాలెన్నున్నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
