TG-3568
Telugu

కట్టెలపై నీ శరీరం

Kattelapai Nee Shareeram

17
views
పల్లవి

కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ – (2) ||కట్టెలపై||

1వ చరణం

దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2) కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) ||ఎన్ని చేసినా||

2వ చరణం

ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2) కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2) ||ఎన్ని చేసినా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.