TG-643
Telugu

కఠిన హృదయమా కరుగవ దేవుని

katthina hrudayamaa karugava deevuni

200
views
పల్లవి

కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు గని వినవా దెబ్బలు గలిగిన లోబడవా

1వ చరణం

ఎన్నో గడువులు ఎన్నోమారులు ఎన్నో గడువులు దొరికినను కన్నుమూసికొని కదలుచునుందువు కనికర కరమునుగని మానవా ||కఠిన హృదయమా||

2వ చరణం

సృష్టికర్తకు మ్రొక్కెదవా! తన సృష్టిని గొని పూజించెదవా సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలెల్ల మంద్రించెదవా ||కఠిన హృదయమా||

3వ చరణం

నీరము రక్తముగా మారినను భారముగా క ప్పలు పేలు జోరీగలు గొప్ప తెగులు వచ్చిన గుణపడెనా ఫరోరాజు! ||కఠిన హృదయమా||

4వ చరణం

దద్దురులై బొబ్బలు పొక్కినను హద్దులేక పిడుగులు పడిన గ్రుద్దినట్లు వడగండ్లు కురిసినను గుణపడెనా ఫరోరాజు ||కఠిన హృదయమా||

5వ చరణం

మిడుతల దండులు చెలరేగి యామిగిలిన వాటిని మ్రింగినను వడివడితడబడు నంధకారమే వచ్చిన గుణపడె నా రాజు ||కఠిన హృదయమా||

6వ చరణం

ఘోషపెట్టి దేశమెల్లనేడ్వగ గుంపులుగా జ్యేష్టులు చావ రోషముతో వెంటబడి నశించి దోషముకై దుఃఖముపడిరే ||కఠిన హృదయమా||

7వ చరణం

నష్టము కష్టము కలిగినను మరి నరులును దేవుడె చెప్పినను ఇష్టపడవు రక్షింపబడుటకై ఇరుకుపడిన నిరుకున జెడిన ||కఠిన హృదయమా||

8వ చరణం

పాపప్రతాపము నెరుగుదువ దాని శాపము తాపము నెరుగు దువా పాపము నొకపరి బట్టితివా అది పట్టుబడి కఠినపరచు ||కఠిన హృదయమా||

9వ చరణం

లోలోపలన న్యాయమబద్దములోపము కలిగిన మోసములో కాలయాపనచేయ నుపాయములేల? వేషధారణయేల ||కఠిన హృదయమా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.