TG-4798
Telugu

కీర్తించరే రాజును కీర్తించరే కొనియాడరే

Keerthincharee Raajunu Keerthincharee Koniyaadaree

0
views
పల్లవి

కీర్తించరే రాజును కీర్తించరే కొనియాడరే యేసును కొనియాడరే నింగిలో ఒక తార మెరిసిపోతుంది - రక్షకుడు పుట్టెనని కనువిందు చేసింది గగనవీధుల్లోన సందడి చేసింది - పరిశుద్ధ ప్రభువుకు స్వాగతమే పలికింది -(2) కీర్తించరే రాజును కీర్తించరే - కొనియాడరే యేసును కొనియాడరే మహిమగల మహారాజు - ముద్దులొలికించే మురిపాల బాలుడు కన్య మరియా నిన్ను కడుపునమొసి - పునితురాలయింది అద్వితీయారూపుడు అతి సుందరుడు - పాపమన్నది లేని పరిశుద్ధుడు -(2) లోకాలనేలే లోకరక్షకుడు ఉఉఉఉ (2) పశులశాలలోన పవళించినాడు కీర్తించరీ రాజును కీర్తించరే - కొనియాడరే యేసును కొనియాడరే దవలవర్ణుడు రత్నవర్ణుడు - రవి కోటి తేజు పాప శాపమును తొలగించ నేడు - భువిలోకి ఏతించెను కరుణగలవాడు కరుణామయుడు - దయగలవాడు దయామయుడు (2) రాజులకు రాజుగా రానైయూన్నాడు ఉఉఉఉ (2) పరిశుద్ధులందరిని కొనిపోతాడు కీర్తించరే రాజును కీర్తించరే - కొనియాడరే యేసును కొనియాడరే నింగిలో ఒక తార మెరిసిపోతుంది - రక్షకుడు పుట్టేనని కనువిందు చేసింది గగనవీధుల్లోన సందడి చేసింది - పరిశుద్ధ ప్రభువుకు స్వాగతమే పలికింది (2) కీర్తించరే రాజును కీర్తించరే యేసును కొనియాడరే