కీర్తించి కొనియాడి ఘన పరతును - స్తోత్రించి స్తుతియించి నిను పాడెదన్
keerthinchi koniyaadi ghana parathunu - sthoothrinchi sthuthiyinchi ninu paadedan
కీర్తించి కొనియాడి ఘన పరతును - స్తోత్రించి స్తుతియించి నిను పాడెదన్ యేసయ్య హల్లేలూయా నా యేసయ్య హల్లేలూయా (2) ఆరాధన స్తుతి ఆరాధనా -ఆరాధన ఘన ఆరాధన (2)
దేవాది దేవుడవు పరలోకమును వీడి - మానవ రూపాన్ని ధరియించినావు రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు - నీవే మా రక్షణ విమోచకుడా (2) ||యేసయ్య||
మమ్మెంతగానో ప్రేమించినావు - నీ ప్రాణములనే అర్పించినావు (2) మా ప్రాణ నాధుడవు ఆధారభూతుడవు - నీవే మా రక్షణ విమోచకుడా (2) ||యేసయ్యా||
ఆశ్చర్య కరుడవు ఆలోచనా కర్త - భలవంతుడైన మా దేవుడా (2) నిత్యుడగు తండ్రీ సమాదాన కర్తా - నీవే మా రక్షణ విమోచకుడా (2) ||యేసయ్యా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.