TG-2628
Telugu

కీర్తింతు నీ నామమున్ నా

keerthinthu nee naamamun naa

72
views
పల్లవి

కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా… సన్నుతింతు నీ నామమున్ (2) మనసారా ఎల్లప్పుడు క్రొత్త గీతముతో నిను నే కొనియాడెదన్ (4)         ||కీర్తింతు||

1వ చరణం

ప్రతి ఉదయం నీ స్తుతి గానం దినమంతయు నీ ధ్యానం ప్రతి కార్యం నీ మహిమార్ధం సంధ్య వేళలో నీ స్తోత్ర గీతం (2) ||కీర్తింతు||

2వ చరణం

నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ వేలాది స్తుతులన్ చెల్లిస్తూ ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ నిన్నే నేను ఆరాధిస్తూ అమూల్యమైనది నీ నామం ఇలలో శ్రేష్టమైనది నీ నామం ఉన్నతమైనది నీ నామం నాకై నిలచిన మోక్ష మార్గం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.