TG-4842
Telugu

ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి

Khandaantharaalee Daatindi Naa Yeesu Keerthi

20
views
పల్లవి

ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి యూదుల రాజులలో నా యేసు మేటి (2) అందుకే నా యేసు పేరు వింటే హేరోదు రాజు కే దడ దడ యేరుషలేము ప్రజలకే దడ దడ (2) ||ఖండాంతరాలే||

1వ చరణం

నా యేసు జననం శాస్త్రానికి వింత నా యేసు మరణం లోకానికి చింత.. ఆ... ఆ.. (2) కాలానికి మధ్యవర్తి నా క్రీస్తు రా చరిత్ర పుటలకేక్కిన శకపురుషుడు రా (2) ||ఖండాంతరాలే||

2వ చరణం

నా యేసు రాజ్యం పరలోక రాజ్యం నా యేసు పాలన దైవ గ్రంథ పాలన .. ఆ... ఆ.. (2) ప్రపంచ రాజుల నే తలదన్నే పాలన అంతమే లేనిదై నిలుచు పాలన ప్రపంచ రాజుల నే తలదన్నే పాలన అంతమే లేనిదై యుగ యుగాలు నిలుచు పాలన ||ఖండాంతరాలే||

3వ చరణం

నా యేసు క్రీస్తు పుట్టుకతో రాజు నా యేసు క్రీస్తు విశ్వానికే రాజు (2) పరలోకమందుఅయినా భూమియందు అయినా యేసు నామమున మోకరిల్లి రా లోకమందు ప్రతి నాలుక నా యేసు నామమును ఒప్పుకొని రక్షణే పొందాలి రా!

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.