TG-4810
Telugu

కొదమ సింహపు దావీదు వంశాన కోటి సూర్యుల తేజస్సుతో

Kodama Sinhapu Daaveedu Vanshaana Kooti Sooryula Theejassuthoo

19
views
పల్లవి

కొదమ సింహపు దావీదు వంశాన కోటి సూర్యుల తేజస్సుతో కన్యమరియమ్మ గర్భాన వెలసి పుట్టెను ఒక పశుశాలలో ఆయనే మహారాజు రాజు రాజు ఆయనే యేసురాజు రాజు రాజు జీవం మార్గం సత్యం వెలుగై ఉన్నాడని జీవం మార్గం సత్యం వెలుగై ఉంటాడని ఆకాశదేశాన ప్రభుసాక్షము తారగా వెలిగి ప్రకటించెను లోకజ్ఞానులు నిను చూడగా ప్రేమగా వచ్చి పూజించెను యూదుల రారాజు పుట్టాడని లోకానికంత శుభమేనని కొనియాడుతు బాల యేసునకు సమర్పించేగా వారి కానుకలు లోకపాపము మోసుకొనిపోవగా వచ్చెను కదా ఆ దైవము లేఖనములు నెరవేర్చగా ఇదియే కదా తన ప్రణాళిక యూదా గోత్రపు సింహాసనం ప్రభుయేసుదే ఇక అధికారం సర్వోన్నతుని సంస్థానం సిలువలో చూపెను క్షమాగుణం రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం ఆయనే మహారాజు రాజు రాజు ఆయనే యేసురాజు రాజు రాజు జీవం మార్గం సత్యం వెలుగై ఉన్నాడని

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.