TG-1699
Telugu

కొండ కోన లోయలోతుల్లో… ఓ

konda koona looyaloothulloo… oo

48
views
పల్లవి

కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ వినబడుతుంది నా యేసుని స్వరమే తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం || కొండ కోన ||

1వ చరణం

నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు హృదయమందు చేర్చుకో నేస్తమా (2) ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ||

2వ చరణం

ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు నిన్ను రక్షించాలని కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.