TG-4808
Telugu

కొండలలో లోయలలో నా తోడువు నీవేనయ్యా

Kondalaloo Looyalaloo Naa Thooduvu Neeveenayyaa

18
views
పల్లవి

కొండలలో లోయలలో నా తోడువు నీవేనయ్యా వేదనలో నా బాధలలో ఆశ్రయం నీవేనయ్యా నీవేనయ్యా నా యేసయ్యా నాకున్న ఆధారము నీవేనయ్యా నా యేసయ్యా నాకున్న ఆశ్రయము నె వెళ్ళే మార్గములో అడ్డంకులున్న - నాకున్న అవకాశం చేజారినా నా ముందు ద్వారాలు మూయబడిన - సహాయం నీవేనయ్యా (2) నా ఇరుకులో విశాలత నా త్రోవకు వెలుగువాయ (2) ||నీవేనయ్యా||

1వ చరణం

నాకున్న ఆరోగ్యం క్షీణించుచున్న - నా దినములే నీడలా మారిన కన్నీరె నాకు ఆహారమైన - నా ఔషదం నీవయ్యా (2) బ్రతికించే వాడవయ్యా బలమిచ్చే వాడవయ్యా (2) ||నీవేనయ్యా||

2వ చరణం

దుష్టుని బాణాలు నను తాకుచున్న - మానని గాయాలు వెంటాడినా. పరిస్థితులన్ని ప్రతికూలమైన - నా ధైర్యము నీవయ్యా (2) గెలిపించే వాడవయ్యా - తలఎత్తే వాడవయ్యా (2) ||నీవేనయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.