కొండలతో చెప్పుము కదిలిపోవాలని బండలతో

kondalathoo cheppumu kadilipoovaalani bandalathoo

🎵 TG-1422🌐 Telugu
పల్లవి

కొండలతో చెప్పుము కదిలిపోవాలని బండలతో మాట్లాడుము కరిగిపోవాలని (2) నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే – (3) మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు మనసులో సందేహించక మాట్లాడు యేసుని నామములోనే మాట్లాడు ||కొండలతో||

1వ చరణం

యేసయ్య ఉన్న దోనె పైన తుఫాను కొట్టెనే యేసయ్య దోనె అమరమున నిద్రించుచుండెనే గాలి పైకి లేచి – అలలు ఎంతో ఎగసి దోనెలోనికొచ్చెను జలములు జోరున శిష్యులేమో జడిసి – వానలోన తడిసి – బహుగా అలసిపోయే ప్రభువా ప్రభువా – లేవవా త్వరగా మేము నశించిపోతున్నామని ప్రభువును లేపిరి – తమలో ఉంచిన – దైవ శక్తి మరచి రక్షకుడు పైకి లేచాడు – శిష్యులకు చేసి చూపాడు పరిస్థితుత్లతో మాటలాడాడు ఆ గాలినేమో గద్దించి – తుఫాన్ని ఆపేసి – నిమ్మల పరిచాడు శిష్యులను తేరి చూచాడు – విశ్వాసం ఎక్కడన్నాడు అధికారం వాడమన్నాడు ఇక మనమంత ప్రభు లాగ – చేసేసి గెలిచేసి ప్రభునే స్తుతిద్దాము – జై జై జై జై జై జై జై జై జై ఈశు మసీహ్ కి జై ఈశు కే జై జై జై ప్రభు కే జై జై జై (2)            ||మాట్లాడు||

2వ చరణం

పరలోక రాజ్య తాళాలు మన చేతికిచ్చెనే పాతాళ లోక ద్వారాలు నిలువనేరవనెనే కన్నులెత్తి చూడు – తెల్లబారె పైరు కోతకొచ్చి నిలిచెను మనకై నేడు వాక్యముతో కది-లించిన చాలు – కోత పండగేలే కాపరి లేని గొర్రెలు వారని – కనికరపడెను ప్రభువు నాడు క్రీస్తుని కనులతో – చూద్దామా – తప్పిపోయిన ప్రజను ప్రభు లాగా వారిని ప్రేమిద్దాం – సాతాను క్రియలు బందిద్దాం విశ్వాస వాక్కు పలికేద్దాం ఇక ఆ తండ్రి చిత్తాన్ని – యేసయ్యతో కలిసి – సంపూర్తి చేద్దాం పరలోక రాజ్య ప్రతినిధులం – తాళాలు ఇంకా తెరిచేద్దాం ఆత్మలను లోనికి నడిపిద్దాం ఇక సంఘంగా ఏకంగా – పాడేద్దాం అందంగా ఈశు మసీహ్ కి జై – జై

Report Error