TG-3580
Telugu

కొనియాడ తరమే నిన్ను

Koniyaada Tharame Ninnu

0
views
పల్లవి

కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను తనరారు దినకరు – బెను తారలను మించు (2) ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు ||కొనియాడ||

1వ చరణం

కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2) నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొనియాడ||

2వ చరణం

సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2) నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ||కొనియాడ||

3వ చరణం

విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2) పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు ||కొనియాడ||

4వ చరణం

దోసంబులను మడియు – దాసాళి కరుణించి (2) యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు ||కొనియాడ||

5వ చరణం

నరులయందున కరుణ – ధర సమాధానంబు (2) చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు ||కొనియాడ||

6వ చరణం

ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని (2) శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత ||కొనియాడ||