TG-3582
Telugu

కొంతసేపు కనబడి

Konthasepu Kanabadi

0
views
పల్లవి

కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం (2) యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు (2) ||కొంతసేపు||

1వ చరణం

ఎదురౌతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరు నీ అక్కరలో (2) వచ్చేదెవరు నీతో మరణము వరకు (2) ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు ||యేసే||

2వ చరణం

చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా (2) ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2) సంపాదన ఎవరిదగును యోచించితివా ||యేసే||

3వ చరణం

నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి (2) విశ్రాంతినీయగ నిన్ను పిలువగా (2) నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా ||యేసే||