కోలాహలముగఁ గూరిమితోఁ గూడి కోలాటమాడను

koolaahalamugam guurimithoom guudi koolaatamaadanu

🎵 TG-227💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

కోలాహలముగఁ గూరిమితోఁ గూడి కోలాటమాడను రా రా మా పాలిటి యేసుని పేరఁ మాపాలిటి యేసుని పేర మ మ్మేలెడి దేవుని పేరఁ ||కోలాహలముగఁ గూరిమితోఁ||

1వ చరణం

మా సామి యా మోక్ష వాసుండు నైనట్టి యేసయ్య పోకను జూడు మా యేసయ్యరాకను బాడు యేసయ్య రాకను బాడు నీ హోసన్న యని మదివేడు ||కోలాహలముగఁ గూరిమితోఁ||

2వ చరణం

పాపంబులన్ మోసి ప్రాణంబు బలి యిచ్చి తాఁ బరమున కేగలేదా నీ జ్ఞాపకములోనికి రాదా జ్ఞాపకములోనికి రాదా నీ ప్రాపకుఁడై యుండలేదా ||కోలాహలముగఁ గూరిమితోఁ||

3వ చరణం

ఏలినవాడైన యేసుని రాకను నాలించి చూడవదేర నిను పాలించు వాడనుకోర పాలించువాడనుకోర పరి శీలించువాడనుకోర ||కోలాహలముగఁ గూరిమితోఁ||

4వ చరణం

అంతములో భువి కా యేసునాధుండు చెంతను దూతలతోడ బల్ వింతగ వచ్చును జూడ వింతగ వచ్చును జూడ న త్యంత బలముతోడ రాఁడ ||కోలాహలముగఁ గూరిమితోఁ||

5వ చరణం

ఆకాశ భూమ్యాదు లార్భటిలు దూతల మూకలతోఁ గూడినాఁడు ఈ లోకాని కేతెంచుఁవాడు లోకాని కేతెంచువాఁడు ఇఁక వీకతోఁ బ్రభుని బాడు ||కోలాహలముగఁ గూరిమితోఁ||

6వ చరణం

భీకర సింహపు టాకారముతోను ఢీకొని మేఘములతోడ బల్ బాకారవంబులు బాడ బాకారంబులు బాడ నిటు ఢీకొని వచ్చెను జూడ ||కోలాహలముగఁ గూరిమితోఁ||

7వ చరణం

భాసురమైనట్టి యేసయ్య రాకను ఈ సూర్యుఁడు జూడలేఁడు తన వి కాసము జీఁకటౌను వి కాసము జీఁకటౌను నీ కా సుగతిఁ జూపువాఁడు ||కోలాహలముగఁ గూరిమితోఁ||

Report Error