కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో
koomtha yajamaanunda sthoothramum guurmithoo
కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో నొనరింతుము ప్రీతి మీర గ మాదు పొలములు పెరిగి పండెను గావునఁ ||కోఁత యజమానుండ||
నీదు సేవకులైన వారలు నిండు మోదముఁ నొందుచు నీ దయ నొక యేటి గ్రాసము నీ దినంబున గాంతురు ||కోఁత యజమానుండ||
విత్తుకాలము కోఁతకాలము విమలమైన తలంపులు చిత్తమునఁ బుట్టించి మాకతి క్షేమ మొసఁగితి రక్షకా ||కోఁత యజమానుండ||
వేసవిని భువి మేము నాటిన విత్తనం బతిరమ్యమై భాసురంబగు పచ్చ మొక్కయి బయలువడె నిది చిత్రము ||కోఁత యజమానుండ||
జల సమాధిని వెడలి చక్కఁగ బలముతో నీ గింజలు బలుఁడు దేవుని శక్తి చేతను బాగుగను ఫలియించెను ||కోఁత యజమానుండ||
ఆ ప్రకారమె నీదు నామము నందు కాలము చేసి యా ప్రజలు దేహములు మహిమను నందఁ జేయుము రక్షకా ||కోఁత యజమానుండ||
కోఁత కార్యమువల్ల గూడను కూర్మిచే నీ బిడ్డలు నీతులను నేర్వంగఁ జేయుము ప్రీతిగల మా రక్షకా ||కోఁత యజమానుండ||
దూత లంత్య దినంబునందున కోఁత గోయుదు రంతట నా తరుణ మున గురుగు లన్నియు నగ్నిలోఁ బడవైతురు ||కోఁత యజమానుండ||
లోకమందలి గాలి వానల లోను మే మిఁక నుండక నాకమందున దండ్రి మింటను నేకముగ జీవింతుము ||కోఁత యజమానుండ||
నీవు నేర్పిన యట్లే మే మిల నిన్నుఁ బ్రతిదినమందును జీవనోపాయంపు భుక్తిని దేవ, వేఁడఁగఁ జేయుమీ ||కోఁత యజమానుండ||
మేఇన నేఁ బోషించు నన్న పానములనే వేఁడక జానుగా నాత్మలకునౌ భో జనము వేఁడఁ నీయుమీ ||కోఁత యజమానుండ||
వసుధ నినుఁ బ్రార్థించు జన జీ వంపు రొట్టెవు నీవెగా అనువు నాదరణంబు భుక్తిని యగుము మా కిల నెప్పుడున్ ||కోఁత యజమానుండ||