TG-4813
Telugu

కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం

Kooti Kaanthula Velugulathoo Udayinchenu Oka Kiranan

0
views
పల్లవి

కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం  (2) ||కోటి కాంతుల||

1వ చరణం

రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2) మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే  (2) ||కోటి కాంతుల||

2వ చరణం

మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా (2) ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే  (2) ||కోటి కాంతుల||