♪♫
TG-4814
Telugu
కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా
Kooti Kiranamula Kaanthini Minchina Shaanthivi Neeveenayyaa
13
views
పల్లవి
కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యా నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే నా ఆధారము నీవే ఆశ్రయము 1. పిండమునై నేనుండగా నీవు అండగా నిలిచితివే మెండైన నీదు దీవెనలొసగి తండ్రిగ చూచితివే ప్రేమతో బ్రోచితివే 2. తల్లియు తండ్రియు విడచిన గాని నీ కృప వీడకను దాతవు నీవై తోడుగా నుండి ఆధారమైనావులే జీవనాధారమైనావులే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.