క్రైస్తవకర్షక కదిలిరావయ్యా
Kraisthavakarshaka Kadiliraavayyaa
క్రైస్తవకర్షక కదిలిరావయ్యా కన్నులు తెరచి కానవేమయ్యా 1. మనుష్యకుమారుడైన క్రీస్తుయేసు మంచివిత్తనమును విత్తెమున్న భూలోకంబనెడు పొలంబునందున వాక్యంబనె విత్తనంబు విత్తెను ||క్రైస్తవ||
2. ఆదిమ క్రైస్తవ బోధకుల వేదనతోను వాక్యంబు విత్తె రోదనతోను రక్తంబును గార్చి ప్రాణంబులను దానంబుజేసిరి ||క్రైస్తవ||
3. చల్లిన వాక్యము ఫలియింపను తొలకరి వర్షము గురిపించెను విలువైన ఫలములు ఫలియించువరకు కడవరి వర్షము కొరకు వేడుదం ||క్రైస్తవ||
4. పొలములు తెల్లబారె తేరిచూడు కాలము చాల గతించిపోయె కోతయజమా నుడైన క్రీస్తుని కోతవారిని పంప కోరివేడుదం ||క్రైస్తవ||
5. శత్రువగు సాతానుకూడా చెడ్డవిత్తనాలు చల్లిపోయె గోధుమల మధ్య గురుగులు కూడ ఘోరంబుగాను పెరుగుచుండెను ||క్రైస్తవ||
6. కన్నీళ్ళతో విత్తు క్రైస్తవుడా కలవర మొందెద వెందులకు సంతోషముతో సంగీతాలతోను సాగిపోవుదుము ఆగిపోకను ||క్రైస్తవ||