TG-4836
Telugu

క్రైస్తవమొక మతము కాదిది

Kraisthavamoka Mathamu Kaadidi

16
views
పల్లవి

క్రైస్తవమొక మతము కాదిది యేసునందు తిరిగి జన్మము క్రీస్తునందు తిరిగి జన్మము (2) ధరల తల్లి దానమొసగును తన రక్తము ప్రతిజనలములో (2) అందరికి జీవమొసగెను కలువరిలో యేసు రక్తము (2) కలువరిలో యేసు రక్తము ||క్రైస్తవమొక||

1వ చరణం

ఒక జన్మకు రెండు చావులు ఇరు జన్మలకొక్క మరణమే (2) సిలువయందే నరకపు చావు పొందెనేసు అందరికొరకు (2) పొందెనేసు అందరికొరకు ||క్రైస్తవమొక||

2వ చరణం

భువికి మూలమీ శరీరము దివిని చేర ఆత్మ మూలము (2) మతము మార్గ జ్ఞానము వీడి మరణ విజయుడేసు చేరుమా (2) మరణ విజయుడేసు చేరుమా ||క్రైస్తవమొక||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.