TG-3587
Telugu

క్రైస్తవుడా సైనికుడా

Kraisthavudaa Sainikudaa

0
views
పల్లవి

క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా (4) జాలరీ మనుషులు పట్టు జాలరి ఆత్మలు పట్టు కాపరి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి ||క్రైస్తవుడా||

1వ చరణం

సిలువే నీ స్థావరము శ్రమలే నీ సైన్యము (2) సహనమే నీ ధైర్యము వాక్యమే నీ విజయము (2) ||క్రైస్తవుడా||

2వ చరణం

సత్యమే నీ గమ్యము సమర్పణే నీ శీలము (2) యేసే నీ కార్యక్రమం ప్రేమే నీ పరాక్రమం (2) ||క్రైస్తవుడా||

3వ చరణం

దేశంలో విదేశంలో గ్రామంలో కుగ్రామంలో (2) అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో (2) ||క్రైస్తవుడా||

4వ చరణం

సిద్ధాంతపు గట్టు దుమికి రా వాగులనే మెట్టును దిగిరా (2) దీనుడా ధన్యుడా విజేయుడా అజేయుడా (2) ||క్రైస్తవుడా||

5వ చరణం

వాగ్ధాన భూమి స్వతంత్రించుకో అద్వానపు అడవి దాటి ముందుకుపో (2) నీ ఇల్లు పెనూయేలు నీ పేరే ఇశ్రాయేలు (2) ||క్రైస్తవుడా||