క్రైస్తవులారా! లెండి యీనాడు క్రీస్తు

kraisthavulaaraa! lendi yeenaadu kreesthu

🎵 TG-130💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

క్రైస్తవులారా! లెండి యీనాడు క్రీస్తు పుట్టెనంచు పాడుఁడి; ప్రసన్నుఁడైన తండ్రి ప్రేమను ఆసక్తిపరులై కీర్తించుఁడి క్రీస్తేను మానవాళితోడను నశింపవచ్చెనంచు పాడుఁడి.

1వ చరణం

దేవుని దూత గొల్లవారికి ఈ రీతిగాను ప్రకతించెనుః 'ఈ వేళ మహా సంతోషంబగు సువార్త నేను ఎరిగింతును. దావీదు పట్నమం దీదినము దైవరక్షకుఁడు జన్మించెను.' ||క్రైస్తవులారా! లెండి||

2వ చరణం

త్వరగానే ఆకాశ సైన్యము హర్షించుచు నీలాగు పాడెను 'సర్వోన్న తాకాశంబునందుండు సర్వేశ్వరునికి ప్రభావము నరులయందు సమాధానము ధరణిలో వ్యాపింపనియ్యుఁడు'. ||క్రైస్తవులారా! లెండి||

3వ చరణం

పరమతండ్రి దయారసము నరులకెంతో నాశ్చర్యము నరావతారుఁడగు దేవుఁడు నిరపరాధిగాను జీవించి నిర్దోషమైన త్రోవ చూపించి విరోధులన్ ప్రేమించుచుండెను. ||క్రైస్తవులారా! లెండి||

4వ చరణం

శ్రీ మాత సైన్యముతో మేమును వాద్యములు వాయించుచుందుము; ఈ దినమందు నుద్భవించిన యా దివ్యకర్తను వీక్షింతుము; సదయుఁడైన యేసు ప్రేమను సదా స్తుతించి పాడుచుందుము. ||క్రైస్తవులారా! లెండి||

Report Error