క్రీస్తేసు పుట్టినాడండోయ్ తమ్ముడా రారాజు పుట్టినాడండోయ్ తమ్ముడా
Kreestheesu Puttinaadandooy Thammudaa Raaraaju Puttinaadandooy Thammudaa
క్రీస్తేసు పుట్టినాడండోయ్ తమ్ముడా రారాజు పుట్టి నాడండోయ్ తమ్ముడా (2) బెత్లహేము గ్రామములో కన్య మరియ గర్భమందు క్రీస్తేసు పుట్టినాడయా (2) పశువుల పాకలోన యేసుక్రీస్తు శిశువుగా వెలసినాడయా (2) క్రీస్తేసు పుట్టినాడు క్రీస్తేసు వచ్చినాడు మన యేసు ||క్రీస్తేసు||
గొల్లలు జ్ఞానులు సాంబ్రాణి బోళము యేసుకు అర్పించినారయ్యా (2) బంగారం విలువైన కానుకలు అర్పించి యేసుని పూజించినారయ్యా (2) క్రీస్తేసు పుట్టినాడు క్రీస్తేసు వచ్చినాడు మన యేసు ||క్రీస్తేసు||
కరుణగల రక్షకుడు సింహాసనం విడిచి భువి పైకి వచ్చినాడయ్యా (2) సాతాను గుండెల్లోన దడదడలు మనకేమో సంతోషాలు సంబరాలు (2) క్రీస్తేసు పుట్టనాడు క్రీస్తేసు వచ్చినాడు మన యేసు ||క్రీస్తేసు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.