క్రీస్తేసు శక్తినామమెల్లరు కీర్తించి కొల్వుడిలన్

kreestheesu shakthinaamamellaru keerthinchi kolvudilan

🎵 TG-146💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

క్రీస్తేసు శక్తినామమెల్లరు కీర్తించి కొల్వుడిలన్ యెపుడు కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు శక్తినామమెల్లరు||

1వ చరణం

సాష్టాంగపడి దూతల్ పరమున నిష్ఠతో గొలుచుచును యేసుని కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు శక్తినామమెల్లరు||

2వ చరణం

హతసాక్ష్యపు జనమా యేసుడె హితమతితో బిలుచున్ మిమ్ముల కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు శక్తినామమెల్లరు||

3వ చరణం

ఇశ్రాయేల్ ప్రజలారా యిచ్చెను ఆశ్రయ రక్షణను యేసుడే కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు శక్తినామమెల్లరు||

4వ చరణం

పాపుల రక్షించెన్ సిలువపై శాపము దొలగించెన్ యేసుడే కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు శక్తినామమెల్లరు||

5వ చరణం

సర్వజనంబులారా క్రీస్తుని సర్వజగంబులలో ఠీవిగ కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి ||క్రీస్తేసు శక్తినామమెల్లరు||

6వ చరణం

పరమందున్నట్టి ప్రభుదగు పరిశుద్ధ సంఘముతో మనము కీర్తి కిరీటము ధరియింప జేయుడి క్రీస్తు నారాధింతము ||క్రీస్తేసు శక్తినామమెల్లరు||

Report Error