క్రీస్తేసుని సైనికులం ప్రియప్రభుని సేవకులం
Kreestheesuni Sainikulan Priyaprabhuni Seevakulan
- టి. స్వరూప్ కుమార్ - Scale : G క్రీస్తేసుని సైనికులం - ప్రియప్రభుని సేవకులం తన అడుగుల జాడలలో - వెనుదిరుగక నడిచెదము మాటలలో ప్రవర్తనలో- విశ్వాసములో పవిత్రతలో మాదిరిగా వుండెదం - ప్రభు ప్రేమను చూపించెదం 1. ఆత్మయందు తీవ్రత కలిగి - ప్రభుపని చేసెదం ఆసక్తి కలిగి మాంధ్యులు కాక - ఆత్మలకై పోరాడెదం అద్భుతకరుడైన యేసునికై - నిత్యము జీవించెదం ||క్రీస్తేసుని||
2. నశించిపోయే విద్యార్థులకై - పరితపించెదం వారి ఆత్మల రక్షణ కొరకై - కష్టించి పనిచేసెదం సత్య సువార్తను ప్రకటించి - స్థిరపరచి బలపరచెదం ||క్రీస్తేసుని||
3. బలమైన దేవుని చేతిక్రింద - దీనులమై వుండెదం నిబ్బరమైన బుద్ధికలిగి - పెద్దలకు లోబడెదం సత్యకృపలో నిలచిఉండి సాతాను నోడించెదం ||క్రీస్తేసుని||
4. విశ్వాసమునకు కర్తయైన - యేసుని చూపెదం విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడెదం నిత్య జీవం చేపట్టి - ఓపికతో పరుగెత్తెదం ||క్రీస్తేసుని||
క్రీస్తేసుని సైనికులం - ప్రియప్రభుని సేవకులం తన అడుగుల జాడలలో - వెనుదిరుగక నడిచెదము మాటలలో ప్రవర్తనలో - విశ్వాసములో పవిత్రతలో మాదిరిగా వుండెదం - ప్రభు ప్రేమను చూపించెదం 1. ఆత్మయందు తీవ్రత కలిగి - ప్రభుపని చేసెదం ఆసక్తి కలిగి మాంధ్యులు కాక - ఆత్మలకై పోరాడెదం అద్భుతకరుడైన యేసునికై - నిత్యము జీవించెదం ||క్రీస్తేసుని||