క్రీస్తేసు ప్రభువు
Kreesthesu Prabhuvu
క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకము వారిది (2) ||క్రీస్తేసు||
అపొస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే (2) ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడు సంఘములో నిలిచెదరు (2) ||క్రీస్తేసు||
పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో (2) వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువు నందు (2) ||క్రీస్తేసు||
ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే తన యందు నిలిచెదరు (2) ప్రకటించెదరు ఆయన మరణ పునరుత్తానమును వారు (2) ||క్రీస్తేసు||
పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్ధించెదరో (2) ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు బంధించెదరు వారే (2) ||క్రీస్తేసు||
క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో (2) నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వ లోకము నందు (2) ||క్రీస్తేసు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.