క్రీస్తు పుట్టెను హల్లెలూయా
kreesthu puttenu halleluuyaa
క్రీస్తు పుట్టెను హల్లెలూయా (2) జగమంతా పండుగాయెను – సర్వలోకానికి సందడాయెను చీకు చింత వీడిపోయె – చీకటంత తొలగిపోయె నవ్యకాంతులెగసె ఇలలో – దివ్యకాంతుడేసు రాకతో… ఉల్లాసమే ఉత్సాహమే – జగమంతా జయోత్సాహమే చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య పాప శాపముతో నిండియుండగా యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో – రక్షణకాంతులే విరజిల్లెను (2) ||చీకు||
గెరాసేను జనములలో కొందరు రోగాలు దయ్యాలతో బాధనొందగా యేసు అడుగుపెట్టెను ఆ ఊరిలో – విడుదలకాంతులే ప్రకాశించెను మరణమాయె యాయీరు కూతురు వేదన రోదన కన్నీటిలో ఆ ఇంటిలో – జీవపుకాంతులే ప్రజ్వలిల్లెను వేదనతో నలిగిపోవుచున్నావా యేసు నీ కొరకై ఉదయించెను లెమ్ము తేజరిల్లుమ్ము నీ ఇంటికి – వెలుగు వచ్చియున్నది (2) ||క్రీస్తు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.