TG-4828
Telugu

క్రీస్తు పుట్టుక జగతికి వేడుక దేవుని ప్రేమకు జ్ఞాపిక లోక రక్షణ కానుక

Kreesthu Puttuka Jagathiki Veeduka Deevuni Preemaku Jnyaapika Looka Rakshana Kaanuka

15
views
పల్లవి

క్రీస్తు పుట్టుక జగతికి వేడుక దేవుని ప్రేమకు జ్ఞాపిక లోక రక్షణ కానుక (2) స్తుతియించి పాడేదం క్రిస్మస్ గీతము కీర్తించి కొనియాడేదం క్రీస్తు నామము (2) ||క్రీస్తు పుట్టుక||

1వ చరణం

తండ్రి మనసును మనకు తెలిపెను సమాధనపరచెను విమోచించెను (2) కోల్పోయిన బంధం క్రీస్తు రాకతో కలిపినది క్రిస్మస్ ఆనందం (2) ||స్తుతియించి||

2వ చరణం

క్రీస్తు కలిగిన మనసును కలిగి సమాధనపరచుచు వెలుగుగా నిలిచెదం (2) బంధింపబడిన జీవితాలకు విడుదలయే క్రిస్మస్ సంతోషం (2) ||స్తుతియించి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.